BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 04 September 2026, 08:15 pm
Posted by : కూనురు మధు

ఎనిమిదో వార్డులో అభివృద్ధికి శ్రీకారం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
04 Sep, 2026 - 08:15 PM
25 వీక్షణలు


* ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశాలతో పలు అభివృద్ధి పనులు ప్రారంభం


చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీత రమేష్ ఆధ్వర్యంలో వార్డులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ కుక్కల మోహన్ మాట్లాడుతూ.. గతంలో సరైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో 8వ వార్డు అనేక సమస్యలకు గురైందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడంతో వార్డులో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత లభిస్తోందని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో వార్డులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని కౌన్సిలర్ పేర్కొన్నారు. అభివృద్ధి పనుల ప్రారంభ కార్యక్రమంలో వార్డు ప్రజలు పాల్గొని కౌన్సిలర్ కుక్కల మోహన్‌ను అభినందించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.