BREAKING
thumb ● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్
Date of Publish : 03 September 2026, 08:04 pm
Posted by : SIVA RAJ

ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
Siva Raj Guntur west Constituency Reporter
03 Sep, 2026 - 08:04 PM
47 వీక్షణలు

గుంటూరు బస్టాండ్‌లో ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకస్మిక తనిఖీలు

గుంటూరు | Ntoday News

గుంటూరు బస్టాండ్‌లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులను వేగవంతం చేయాలని ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శివప్రసాద్ అధికారులను ఆదేశించారు. బస్టాండ్‌లో ఆయన ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి పలు అంశాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా బస్టాండ్‌లోని దుకాణాల్లో వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని దుకాణదారులను హెచ్చరించారు. ప్రయాణికుల నుంచి అధిక ధరలకు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు రాకుండా అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని సూచించారు.

బస్టాండ్‌లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యం, ప్రయాణికుల సౌకర్యాలు, బస్టాండ్ పరిసరాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

అదేవిధంగా గుంటూరులో చేపడుతున్న ఎలక్ట్రిక్ బస్ డిపో నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని శివప్రసాద్ అధికారులకు సూచించారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచాలని ఆయన పేర్కొన్నారు.