BREAKING
మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ తాడికొండ: గోపి మృతి పై పోలీసుల వివరణ .... పటాన్‌చెరు: పాఠశాలలో నాలుగు గదులకు శంకుస్థాపన ముత్యాలమ్మపాలెంలో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా జలాభిషేకం మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ తాడికొండ: గోపి మృతి పై పోలీసుల వివరణ .... పటాన్‌చెరు: పాఠశాలలో నాలుగు గదులకు శంకుస్థాపన ముత్యాలమ్మపాలెంలో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా జలాభిషేకం
Date of Publish : 03 September 2026, 03:39 pm
Posted by : NTODAY NEWS

మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
03 Sep, 2026 - 03:39 PM
17 వీక్షణలు

హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ పరంజ్యోతి.

హైదరాబాద్/ఎన్ టుడే న్యూస్.‌

హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ పరంజ్యోతి ఈరోజు హెచ్ఎండిఏ ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ జిందాబాద్ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పరంజ్యోతి మాట్లాడుతూ... రాబోయే వినాయక చవితికి మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించాలని, పర్యావరణ పర్యావరణాన్ని కాపాడాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలలో విస్తృతంగా అవగాహన కల్పించాలని, హెచ్ఎండిఏ ప్రతి సంవత్సరం ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నదని అన్నారు.

         హైదరాబాద్ జిందాబాద్, హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం (HCF) ప్రధాన కార్యదర్శి  కె.వీరయ్య మాట్లాడుతూ... ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను ప్రతిష్టించడం వలన నగరంలో హుస్సేన్ సాగర్ మరియు  చెరువులు కుంటలు కాలుష్యానికి గురవుతున్నాయని, పర్యావరణానికి హానికరం కాని మట్టి గణపతి విగ్రహాలనే  ప్రతిష్టించాలని పిలుపు నిచ్చారు. నగరంలో  వైభవంగా  నిర్వహించుకొనే  “వినాయక చవితి” పండుగ  సందర్భంగా  అందరూ ఇండ్లలోనూ, అపార్ట్‌మెంట్స్, కాలనీ, బస్తీలలో సామూహికంగాను మట్టి గణపతి విగ్రహాలను  ప్రతిష్టించాలని అన్నారు.  నగరంలో ఇప్పటికే పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి, మరింతగా పెరగకుండా  ఉండటానికి అందరూ తమ వంతు కృషి చేయాలని కోరారు. గౌరవ హైకోర్టు “ పర్యావరణానికి హాని చెయ్యని మట్టి విగ్రహాలనే ప్రతిష్టించాలని, విగ్రహాల ఎత్తు ఐదు అడుగులు మించకుండా చూడాలని” సూచించిందని అన్నారు. భక్తుల విశ్వాసాలను, సమాజ భవిష్యత్తు, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని గౌరవ హైకోర్టు ఇచ్చిన సూచనలను అందరం పాటిద్దాం అని అన్నారు. 

వినాయక  విగ్రహాలలో అత్యధికం ప్లాస్టర్ ఆఫ్  పారిస్‌తో అనేక రకాల రసాయనిక రంగులతో తయారవుతున్నాయని, ఈ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లోను, నగరంలోని వివిధ చెరువులలో నిమజ్జనం చెయ్యటం జరుగుచున్నదని చెప్పారు. పర్యావరణ వేత్తల లెక్కల ప్రకారం నిమజ్జనం సమయంలో ఒక్క రోజులోనే హుస్సేన్ సాగర్‌లో  8,000 నుండి 9,000 టన్నుల ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ప్లాస్టిక్ , పాదరసం, సీసం, నిహాల్, టర్పెంటైన్, రెడ్ ఆక్సైడ్, సిలికాన్ వంటి అనేక విష రసాయనాలు ఉంటున్నాయని కె. వీరయ్య అన్నారు. ఈ విష రసాయనాలు  హుస్సేన్‌సాగర్ మరియు చెరువులలో  కలవటం వలన కాలుష్య సాగరాలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

“మానవ సేవే మాధవ సేవ”, మానవ సమాజ మనుగడకే ముప్ప్పుగా పరిణమిస్తున్న కాలుష్యాన్ని నియంత్రించాల్సిన అవసరముందని అన్నారు. నగరంలోని కొన్ని చెరువుల చుట్టు ప్రక్కల కాలనీలలోని డ్రైనేజి పైప్ లైన్లు ఆయా చెరువులలో కలిపేస్తున్నారని, ఫలితంగా చెరువులన్నీ కాలుష్య భరితమై దుర్గంధంతో దోమల కేంద్రాలుగా తయారయ్యాయని అన్నారు. వీటికి తోడు ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయరైన విగ్రహాల నిమజ్జనం ఫలితంగా కాలుష్యం మరింత పెరిగి  పరిసర కాలనీల ప్రజల ఆరోగ్యాలపై ప్రభావం చూపిస్తున్నాయాని చెప్పారు. వీటి కారణంగా  క్యాన్సర్, చర్మవ్యాధులకు గురికావలసి వస్తున్నదని అన్నారు. గత 10 సంవత్సరాల నుండి “హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం”( హైదరాబాద్ జిందాబాద్)  ఆధ్వర్యంలో  హెచఎండిఏ సహకారంతో  గ్రేటర్‌లోని 45 కాలనీలలో, అపార్ట్‌మెంట్‌లలో  మట్టి గణపతుల ఉచిత పంపిణి చేస్తున్నామని, పర్యావరణహితమైన మట్టి విగ్రహాలను భక్తితో అందరం పూజిద్దాం అని అన్నారు.

పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో హెచ్ఎండిఏ సూపరిండెంట్ ఇంజనీర్  అప్పారావు , ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ గారు, హైదరాబాద్ జిందాబాద్ నాయకులు ఎం.శ్రీనివాసరావు, మోహన్ నాయుడు, పి.శ్రీనివాసరావు, గోపాల్, మల్లం రమేష్, కృష్ణమోహన్, తదితరులు పాల్గొన్నారు.