BREAKING
thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Date of Publish : 03 September 2026, 02:36 pm
Posted by : DAVU RAVINDER REDDY

లేని ఆస్తుల రిజిస్ట్రేషన్.. రూ.4.11 కోట్ల బ్యాంకు రుణాల మోసం

తెలంగాణ
/ హైదరాబాద్
03 Sep, 2026 - 02:36 PM
82 వీక్షణలు


చంపాపేట సబ్‌ రిజిస్ట్రార్ అరెస్ట్.. స్కామ్‌లో 29 మంది పాత్ర ఉన్నట్లు గుర్తింపు

హైదరాబాద్ | Ntoday News

లేని ఆస్తులను కాగితాలపై ఉన్నట్లుగా చూపించి బ్యాంకుల నుంచి భారీగా రుణాలు పొందిన కేసులో చంపాపేట సబ్‌ రిజిస్ట్రార్ మహ్మద్ యూసుఫ్ ఉర్ రెహ్మాన్‌ను కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో నకిలీ ఆస్తులను చూపించి బ్యాంకుల నుంచి రూ.4.11 కోట్ల రుణాలు పొందినట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసుల దర్యాప్తులో భాగంగా.. గతంలో కీసరలో సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేసిన సమయంలో యూసుఫ్ ఉర్ రెహ్మాన్ ఉనికిలో లేని 11 ఆస్తులకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు తేలినట్లు సమాచారం.

ఈ కుంభకోణంలో మొత్తం 29 మంది పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. తాజాగా చంపాపేట సబ్‌ రిజిస్ట్రార్‌ను కూడా అరెస్ట్ చేయడంతో కేసు దర్యాప్తు మరింత వేగవంతమైంది.

ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా? లేని ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా ఇంకా ఎన్ని లావాదేవీలు జరిగాయి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.