BREAKING
thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Date of Publish : 03 September 2026, 03:15 pm
Posted by : BOYA SWAMY

చిట్యాల మార్కెట్ యార్డులో నూతన పాల శీతలీకరణ కేంద్రం ప్రారంభం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Boya Swamy Chityala Mandal
03 Sep, 2026 - 03:15 PM
76 వీక్షణలు

పాడి రైతులకు రూ.20 లక్షల విలువైన చెక్కు అందజేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల | Ntoday News

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలోని మార్కెట్ యార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన పాల శీతలీకరణ కేంద్రాన్ని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. సెప్టెంబర్ 3న నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, నాయకులు, పాడి రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా పాల ఉత్పత్తిదారులైన రైతులకు రూ.20 లక్షల విలువైన చెక్కును ఎమ్మెల్యే వేముల వీరేశం అందజేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాడి రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడటమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. నూతన పాల శీతలీకరణ కేంద్రం అందుబాటులోకి రావడం ద్వారా చిట్యాల పరిసర ప్రాంతాల పాడి రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

పాల నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పాడి రంగాన్ని మరింత అభివృద్ధి చేసి రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు.

ఈ కార్యక్రమంలో విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్రా వినోద్-మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పందిరి గీత-రమేష్, ప్రజాప్రతినిధులు, నాయకులు, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.