BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 04 September 2026, 05:48 pm
Posted by : SEETHA KIRAN KUMAR

సెప్టెంబర్ 6న ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
04 Sep, 2026 - 05:48 PM
11 వీక్షణలు

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సెప్టెంబర్ 6న ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

సెప్టెంబర్ 6న మధ్యాహ్నం భోజనం అనంతరం 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు.

శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై పార్టీ తరఫున లేవనెత్తాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. సమావేశానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పనిసరిగా హాజరు కావాలని కేసీఆర్ సూచించినట్లు సమాచారం.