BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 04 September 2026, 09:15 pm
Posted by : KOUNDINYASRI NANDURI VENKATESWARA RAJU

ఐఐఏ తెలంగాణ చాప్టర్ వైస్ చైర్‌పర్సన్‌గా ఆర్కిటెక్ట్ యెండూరి సురేష్ బాబు ఘన విజయం

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
koundinyasri Nanduri Venkateswara raju మార్కాపురం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
04 Sep, 2026 - 09:15 PM
6 వీక్షణలు

ఐఐఏ తెలంగాణ చాప్టర్ వైస్ చైర్‌పర్సన్‌గా ఆర్కిటెక్ట్ యెండూరి సురేష్ బాబు ఘన విజయం వాస్తుశిల్పుల ఐక్యత, వృత్తి అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి.

హైదరాబాద్, సెప్టెంబర్ 4: భారతీయ వాస్తుశిల్పుల సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ (IIA) తెలంగాణ చాప్టర్ ఎన్నికల్లో ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆర్కిటెక్ట్ యెండూరి సురేష్ బాబు వైస్ చైర్‌పర్సన్‌గా ఘన విజయం సాధించారు.

ఈ సందర్భంగా ఆర్కిటెక్ట్ యెండూరి సురేష్ బాబు మాట్లాడుతూ, తన విజయానికి సహకరించిన తెలంగాణ రాష్ట్రంలోని ఆర్కిటెక్ట్ సభ్యులు, సీనియర్ ఆర్కిటెక్ట్‌లు, సహచరులు మరియు శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

తనపై నమ్మకం ఉంచి అందించిన ఈ విజయాన్ని వ్యక్తిగత విజయంగా కాకుండా, మొత్తం వాస్తుశిల్పుల సమాజం సాధించిన విజయంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

కొత్తగా ఎన్నికైన కార్యవర్గంతో కలిసి IIA తెలంగాణ చాప్టర్‌ను మరింత బలోపేతం చేసి, ఐక్యంగా, ప్రగతిశీలంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు.

వాస్తుశిల్ప వృత్తి అభివృద్ధి, యువ ఆర్కిటెక్ట్‌లకు ప్రోత్సాహం, వృత్తిపరమైన నైపుణ్యాల పెంపు, సీనియర్ మరియు యువ ఆర్కిటెక్ట్‌ల మధ్య సమన్వయం వంటి అంశాలకు తన పదవీకాలంలో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని అన్నారు.

“మనందరం కలిసి పనిచేస్తేనే IIA తెలంగాణను మరింత బలమైన, ఐక్యమైన మరియు గొప్ప సంస్థగా తీర్చిదిద్దగలం. ఈ విజయం మీ అందరిదీ. మీ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు పూర్తి నిబద్ధతతో పనిచేస్తాను” అని ఆర్కిటెక్ట్ యెండూరి సురేష్ బాబు పేర్కొన్నారు.