BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 21 July 2026, 07:46 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

శ్రీశైలం–హైదరాబాద్ రహదారిపై పెద్దపులి కలకలం.. వాహనదారుల్లో ఆందోళన

ఆంధ్రప్రదేశ్
/ కర్నూలు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jul, 2026 - 07:46 AM
99 వీక్షణలు

శ్రీశైలం–హైదరాబాద్ రహదారిపై పెద్దపులి కలకలం.. వాహనదారుల్లో ఆందోళన

శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిపై పెద్దపులి కనిపించడం కలకలం రేపింది. మున్ననూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహనదారులకు రహదారిపై పెద్దపులి సంచరిస్తూ కనిపించింది. అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన పులిని చూసిన ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

కొంతసేపు పులి రహదారిపైనే నడుస్తూ కనిపించడంతో వాహనదారులు తమ వాహనాలను నిలిపివేసి సురక్షిత దూరంలో వేచి చూశారు. అనంతరం పులి సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఈ ఘటనను కొందరు ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించగా, ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతోంది. రహదారిపై అడవి జంతువులు సంచరించే అవకాశం ఉన్నందున శ్రీశైలం అటవీ మార్గంలో ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో అనవసరంగా వాహనాలను ఆపకుండా, అడవి జంతువులకు దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు.