BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 04 September 2026, 09:12 pm
Posted by : ఈడూరి డేవిడ్

21 కిలోల గంజాయి స్వాధీనం

ఆంధ్రప్రదేశ్
Reporter
ఈడూరి డేవిడ్ గోపాలపురం నియోజకవర్గ ప్రతినిధి
04 Sep, 2026 - 09:12 PM
5 వీక్షణలు

21 కిలోల గంజాయి స్వాధీనం

తూర్పు గోదావరి జిల్లా

దేవరపల్లి పోలీస్ స్టేషన్

యర్నగూడెం శివారులో 21 కిలోల గంజాయి స్వాధీనం – ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామ శివారులో, జాతీయ రహదారి (NH-16) సమీపంలోని పాత బ్రాందీ షాపు వద్ద కొంతమంది వ్యక్తులు రెండు మోటారు సైకిళ్లపై వచ్చి, రెండు బ్యాగుల్లో గంజాయిని కలిగి ఉన్నారనే ముందస్తు పక్కా సమాచారంతో దేవరపల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌.ఐ.  P.మనోహర్  పోలీసు సిబ్బందితో కలిసి మధ్యవర్తుల సమక్షంలో తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి 21 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా వారు ఉపయోగిస్తున్న రెండు మోటారు సైకిళ్లు మరియు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన గంజాయి విలువ  సుమారు 2 లక్షలు ఉంటుంది 

పోలీసులకు పట్టుబడిన వ్యక్తులు:

1. మోచర్ల హేమంత్ కుమార్ @ చిన్ను, తండ్రి: అమ్మన్న, వయస్సు: 20 సంవత్సరాలు, కొర్నిపాడు గ్రామం, పెదపారుపూడి మండలం.

2. చామనపూడి శరణ్ దాస్ @ చరణ్, తండ్రి: భగవాన్ దాస్, వయస్సు: 28 సంవత్సరాలు, శ్రీనగర్ కట్ట, తాడిగడప, పెనమలూరు మండలం.

ప్రాథమిక దర్యాప్తులో, వీరిద్దరూ గతంలో అనగా 31-08-2026 ఉదయం యెర్నగూడెం సమీపంలో హైవే మొబైల్ విధుల్లో ఉన్న పోలీసు కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేసి పారిపోయిన కేసులో కూడా ముద్దాయిగా పోలీసులు గుర్తించారు.

ఈ కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తును దేవరపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్  నాగేశ్వర నాయక్  నిర్వహిస్తున్నారు.

అరెస్టు చేసిన ముద్దాయిలను గౌరవనీయ న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరుగుతుంది.

దేవరపల్లి సి.ఐ.