BREAKING
శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష
Date of Publish : 21 July 2026, 07:43 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కాంగ్రెస్‌ ప్రభుత్వం చేతులెత్తేసింది: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jul, 2026 - 07:43 AM
105 వీక్షణలు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కాంగ్రెస్‌ ప్రభుత్వం చేతులెత్తేసింది: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

పెద్దపల్లి: ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నాయకుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.

సోమవారం పెద్దపల్లిలో విద్యార్థులకు స్కాలర్‌షిప్ పత్రాలను పంపిణీ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఇప్పటికీ విడుదల చేయలేదని అన్నారు. దీంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల నుంచే నేరుగా ఫీజులు వసూలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.

దీని వల్ల ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలపై తీవ్ర భారం పడుతోందని, ఎంతో మంది విద్యార్థులు చదువులు కొనసాగించలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసి, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.