BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 04 September 2026, 04:22 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అక్కపాలెం శివారులో జూద శిబిరంపై పోలీసుల మెరుపుదాడి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Sep, 2026 - 04:22 PM
13 వీక్షణలు

ముగ్గురు అరెస్ట్‌.. రూ.7,420 నగదు, కోడిపుంజు, పేకముక్కలు స్వాధీనం

తిరువూరు, సెప్టెంబర్ 4: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం అక్కపాలెం గ్రామ శివారులో కోడి పందేలు, జూదం నిర్వహిస్తున్న వారిపై తిరువూరు పోలీసులు మెరుపుదాడి నిర్వహించారు. విశ్వసనీయ రహస్య సమాచారం మేరకు తిరువూరు పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ శాతకర్ణి సిబ్బందితో కలిసి శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మికంగా దాడి చేపట్టారు. ఈ సందర్భంగా జూదంలో పాల్గొంటున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.7,420 నగదు, ఒక కోడిపుంజు, పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను చట్టబద్ధంగా అరెస్టు చేసి, ఆంధ్రప్రదేశ్ గేమింగ్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

జూదానికి దూరంగా ఉండాలి

ప్రభుత్వం నిషేధించిన జూద కార్యకలాపాల్లో పాల్గొనడం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరించారు. కోడి పందేలు, నగదు పణంగా జూదం వంటి కార్యకలాపాలు కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయడమే కాకుండా సామాజిక శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందన్నారు. ఎవరైనా ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజలు జూదాలకు దూరంగా ఉండాలని తిరువూరు పోలీసులు విజ్ఞప్తి చేశారు.