దేవాలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం అందజేసిన కొక్కిరాల సురేఖ
తెలంగాణ
/
మంచిర్యాల
/
దండేపల్లి
మంచిర్యాల: దండేపల్లి మండలం పెద్దపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన భీమన్న విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం దేవాలయ అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.50 వేల విరాళాన్ని దేవాలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించడం అభినందనీయమని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కొక్కిరాల సురేఖను దేవాలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు.
కార్యక్రమంలో పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు, మంచిర్యాల జిల్లా RGPRS అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, జిల్లా అధికార ప్రతినిధి బియ్యాల తిరుపతి, వార్డు సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానిక నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.