BREAKING
హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్
Date of Publish : 21 April 2026, 01:55 pm
Posted by : యామనూరి మల్లికార్జున

జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిరోజు స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
21 Apr, 2026 - 01:55 PM
135 వీక్షణలు

జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిరోజు ‘స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో’ కార్యక్రమం నిర్వహణ.. ప్రజల భద్రతే లక్షమ్ 

ప్రజల భద్రతే లక్ష్యంగా విస్తృత తనిఖీలు.....

రోడ్డు ప్రమాదాలు నియంత్రించుటకు ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారులలో స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో’ కార్యక్రమం నిర్వహించడంతో పాటు వాహనాలు తనిఖీ చేయాలన్న నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS ఆదేశాలమేరకు పోలీస్ అధికారులు వారి సిబ్బంది సహాయంతో ప్రైవేట్ వాహనాలు,ఆర్టీసి ట్రావెలింగ్ బస్సులలో ముఖ్యంగా రాత్రి పూట తిరిగే వాహనాలలో ప్రజల భద్రతను దృషిలో ఉంచుకొని రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు మరియు సరైన భద్రతా చర్యలు,జాగ్రత్తలు పాటించాలని  బస్సులలో  తనిఖీలు నిర్వహిస్తున్నారు.

రోడ్డుప్రమాదాల నివారణకు నంద్యాల పోలీసులు అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు జిల్లా రాత్రిపూట తిరిగే వాహనాలను ఆపి “స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో” కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 

జిల్లాలోని కడప నుండి నంద్యాల హైవే,కర్నూలు నుండి విజయవాడ వెళ్ళే వాహనాలు,నంద్యాల నుండి కర్నూలు NH 44 హైవే,కర్నూలు నుండి బెంగుళూరు వైపు వెళ్ళే వాహనాలు మరియు జిల్లాలో ముఖ్యమైన ప్రాంతాలలో ఈ “స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో”కార్యాక్రమం నిర్వహించడం జరిగింది.అంతేకాక వాహనాలకు సంబంధించిన ద్రువపత్రాలు, డ్రైవర్‌ల లైసెన్సుల వంటి భద్రతా ప్రమాణాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తున్నారు. 

వాహనాలు నడిపే సమయంలో ప్రమాదాలు జరగకుండా జాగ్రతలు తీసుకోవాలని డ్రైవర్లకు గుర్తు చేస్తున్నారు. వాహనాలను అతి వేగంతో నడపకుండా, రాంగ్ రూట్ లో వెళ్ళకుండా, పరిమితికి మించి ప్రయాణీకులకు ఎక్కించుకునే డ్రైవర్లపై చర్యలు తీసుకుంటామని నంద్యాల జిల్లా పోలీసులు తెలియజేశారు.

జిల్లా పోలీసు కార్యాలయం,నంద్యాల.