BREAKING
విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​
Date of Publish : 24 July 2026, 06:16 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో ఘనంగా మెగా పేరెంట్–టీచర్ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Jul, 2026 - 06:16 PM
189 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, గంపలగూడెం మండలం, పెనుగొలను:

పెనుగొలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్–టీచర్ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం. దుర్గాప్రసాద్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఏడాదితో పోలిస్తే ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పలు సంక్షేమ సౌకర్యాలు అందుతున్నాయని, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం ఉంచి తమ పిల్లలను చేర్పించాలని కోరారు.

కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఆదూరి ఆంజనేయులు, సహకార సంఘం అధ్యక్షుడు నాగళ్ళ మురళి, మాజీ సర్పంచి సంగెపు నారాయణ, మాజీ సహకార సంఘం అధ్యక్షుడు నంబూరి శ్రీనివాసరావు, మెట్టగుట్ట దేవస్థానం చైర్మన్ పంది వెంకట్రావు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు బొలగాని కోటేశ్వరరావు, యనమద్ది విజయకుమార్, ఎం. రాజారెడ్డి, బొలగాని కృష్ణారావు, తోట నాగరాజు, సంగెపు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అనంతరం పెనుగొలను ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో కూడా ప్రధానోపాధ్యాయుడు కొర్రపాటి యోహాను అధ్యక్షతన మెగా పేరెంట్–టీచర్ సమావేశం నిర్వహించారు. విద్యార్థుల అభ్యాస పురోగతి, క్రమశిక్షణ, హాజరు శాతం, తల్లిదండ్రుల బాధ్యతలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.