BREAKING
విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​
Date of Publish : 24 July 2026, 06:16 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కృషి ఉడాన్‌తో చవకగా వ్యవసాయ ఉత్పత్తుల కార్గో రవాణా: ఎంపీ పుట్టా మహేష్ కుమార్

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Jul, 2026 - 06:16 PM
65 వీక్షణలు

ఏలూరు/న్యూఢిల్లీ, జూలై 24: వ్యవసాయ ఉత్పత్తులను తక్కువ ఖర్చుతో, వేగంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కృషి ఉడాన్ పథకం రైతులకు ప్రయోజనకరంగా మారుతోందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఈ పథకం అమలుపై లోక్‌సభలో ఆయన అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ సమాధానం ఇచ్చారు.

కేంద్ర మంత్రి తెలిపిన వివరాల ప్రకారం, ఉద్యాన, మత్స్య, పశుసంపదతో పాటు శుద్ధి చేసిన వ్యవసాయ ఉత్పత్తులను తక్కువ వ్యయంతో, నిర్ణీత సమయంలో గమ్యస్థానాలకు చేర్చేందుకు కృషి ఉడాన్ పథకం దోహదపడుతోంది. ఎంపిక చేసిన విమానాశ్రయాల్లో ప్యాసింజర్ టు కార్గో (P2C) విమానాలకు ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలతో పాటు రూట్ నావిగేషన్, టెర్మినల్ నావిగేషన్ ల్యాండింగ్ ఛార్జీల మినహాయింపు కల్పిస్తున్నట్లు వివరించారు.

రాష్ట్రంలోని విమానాశ్రయాల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల కార్గో రవాణా గత రెండేళ్లలో గణనీయంగా పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాజమండ్రి విమానాశ్రయం నుంచి 2023–24లో 2 మెట్రిక్ టన్నులుగా ఉన్న కార్గో రవాణా 2025–26 నాటికి 10 మెట్రిక్ టన్నులకు చేరుకుంది. తిరుపతి విమానాశ్రయంలో ఇదే కాలంలో 7 టన్నుల నుంచి 28 టన్నులకు పెరిగింది. విజయవాడ విమానాశ్రయం నుంచి 162 మెట్రిక్ టన్నులుగా ఉన్న రవాణా 349 టన్నులకు చేరుకుంది. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి 1,694 మెట్రిక్ టన్నుల నుంచి 1,877 మెట్రిక్ టన్నులకు పెరిగింది.

ప్రస్తుతం విశాఖపట్నం విమానాశ్రయం నుంచే అంతర్జాతీయ కార్గో సేవలు అందుబాటులో ఉండగా, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల నుంచి కూడా త్వరలో అంతర్జాతీయ కార్గో సేవలు ప్రారంభించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు.

వ్యవసాయ ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించడంతో పాటు రైతులకు మెరుగైన ధరలు అందేలా కార్గో రవాణా కీలకంగా మారుతోందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేర్కొన్నారు. విమానాశ్రయాల ద్వారా సరకు రవాణా పెరగడం రైతులతో పాటు విమానాశ్రయాల అభివృద్ధికీ దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.