BRICS కనెక్ట్ ద్వారా కీలక సంస్కరణలు.. భారత్ ప్రణాళిక
డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల విస్తరణకు ప్రాధాన్యం
న్యూఢిల్లీ | Ntoday News
BRICS వేదికగా కీలక సంస్కరణలను అమలు చేసేందుకు భారత్ ప్రణాళికలు రూపొందిస్తోంది. సభ్య దేశాల మధ్య డిజిటల్ అనుసంధానాన్ని పెంచడంతో పాటు ప్రజలకు, వ్యాపారాలకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ‘BRICS Connect’ కార్యక్రమంపై దృష్టి సారిస్తోంది.
డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవలను విస్తరించడం ద్వారా సరిహద్దులు దాటి లావాదేవీలను మరింత సులభతరం చేయాలని భారత్ భావిస్తోంది. అదే సమయంలో సభ్య దేశాల మధ్య విద్యార్హతల పరస్పర గుర్తింపు, అందుబాటు ధరల్లో ఇంటర్నెట్ సేవలు, కృత్రిమ మేధస్సు (AI) సదుపాయాలను విస్తరించేందుకు చర్యలు చేపట్టాలని ప్రతిపాదిస్తోంది.
స్మార్ట్ ట్రేడ్ కారిడార్లకు ప్రాధాన్యం
వ్యాపార నిర్వహణ వ్యయాలను తగ్గించి, సభ్య దేశాల మధ్య వాణిజ్యాన్ని వేగవంతం చేసేలా స్మార్ట్ ట్రేడ్ కారిడార్ల ఏర్పాటు చేయాలని భారత్ ప్రణాళిక రూపొందిస్తోంది.
డిజిటల్ మౌలిక వసతులు, ఆర్థిక సేవలు, విద్య, ఏఐ, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచడం ద్వారా BRICS దేశాల మధ్య ఆర్థిక అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.