BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 24 July 2026, 06:16 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – రూ.2.94 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Jul, 2026 - 06:16 PM
38 వీక్షణలు

ఏలూరు జిల్లా, చింతలపూడి: ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ చింతలపూడి శాసనసభ్యుడు సొంగా రోషన్ కుమార్ ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన మొత్తం రూ.2,94,305 విలువైన ఆర్థిక సహాయ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. స్థానిక కూటమి నాయకులతో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామానికి చెందిన గూడె రాములమ్మకు రూ.22,795, లింగపాలెం మండలం మటన్‌గూడెం గ్రామానికి చెందిన శ్రీకాకొల్లు వెంకట రమణయ్యకు రూ.35,427, జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన పట్నాల జాహ్నవి శ్రీ సాయి ప్రశాంతికి రూ.2,16,083, చింతలపూడి పట్టణానికి చెందిన సి.హెచ్. వజ్రంకు రూ.20,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.

కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మొత్తం రూ.2,94,305 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఈ సందర్భంగా పంపిణీ చేశారు.