BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

గొల్లప్రోలు లో అంబరాన్నంటిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ / గొల్లప్రోలు
Reporter
బోరా శివారెడ్డి గొల్లప్రోలు మండల ప్రతినిధి
21 Apr, 2026 - 10:13 AM
71 వీక్షణలు

అలుపెరగని పోరాట యోధుడు చంద్రబాబు: టిడిపి శ్రేణులు

అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు గొల్లప్రోలు పట్టణ అధ్యక్షులు గుండ్ర సుబ్బారావు 

రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం పరితపించే మహోన్నత నేత నారా చంద్రబాబు నాయుడు. 

అన్నా క్యాంటీన్ వద్ద ప్రజలకు ఉచిత అన్నదానం 

ప్రజలకు స్వయంగా భోజనం వడ్డించిన గుండ్ర సుబ్బారావు. 

ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పేదలకు అండగా ఉంటాం.

అన్న క్యాంటీన్లు పేదల ఆకలి తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 

టిడిపి పార్టీ పట్టణ అధ్యక్షుడు గుండ్ర  సుబ్బారావు

ప్రపంచ పటంలో తెలుగు ఖ్యాతిని చాటిచెప్పిన నాయకుడు చంద్రబాబు: తెదేపా శ్రేణులు.

పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు వర్మ ఆదేశాలు మేరకు ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణ సారథి, తెలుగుజాతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు టౌన్ లో సోమవారం అత్యంత వైభవంగా జరిగాయి.తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చి పండుగ వాతావరణంలో ఈ వేడుకలను నిర్వహించారు. అనంతరం అన్న క్యాంటీన్ వద్ద నిరుపేదలకు, కార్మికులు, వృద్ధులు, మహిళలు ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ప్రజలకు ఉచిత అన్నదానం నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది. స్వయంగా ఆయనే భోజనం వడ్డిస్తూ సేవా భావాన్ని ప్రదర్శించారు. అనంతరం గుండ్ర సుబ్బారావు ప్రజలతో కలిసి భోజనం చేసి భోజనం నాణ్యత పై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా  గుండ్ర సుబ్బారావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మచ్చలేని మహోన్నత నాయకుడని కొనియాడారు. 76.ఏళ్ల ప్రాయంలోనూ యువకుడిని తలపించే ఉత్సాహంతో, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు ఆయన అలుపెరగని కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రాజధాని లేని రాష్ట్రానికి అమరావతి వంటి అద్భుతమైన రాజధానిని కానుకగా అందించిన దార్శనికుడు ఆయనేనని కొనియాడారు. హైదరాబాద్ నగరం నేడు ప్రపంచస్థాయి ఐటీ హబ్‌గా నిలిచిందంటే అది చంద్రబాబు దార్శనికతకు నిదర్శనమని, అదే తరహాలో ఏపీని కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు విదేశీ కంపెనీలను రప్పిస్తూ లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారని తెలిపారు. "తెలుగు జాతి, మానవ సృష్టి ఉన్నంతకాలం చంద్రన్న పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది" అని ఆయన భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి జోడెడ్లలా దూసుకుపోతున్నాయని నాయకులు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యువ నేత నారా లోకేష్‌ల సమన్వయంతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. భద్రాచల సీతారామచంద్ర స్వామి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు . మెయిన్ రోడ్డు రాయవరం సెంటర్లో మధ్య  కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు.. టిడిపి శ్రేణులు హుషారుగా , జోష్ తో బాణాసంచా కాల్చారు. టిడిపి కార్యకర్తలు చంద్రబాబు పాటలకు స్టెప్పులు వేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీ పట్టణ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు, వార్డు కౌన్సిలర్లు, అభిమానులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.