BREAKING
ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు
Date of Publish : 20 July 2026, 09:37 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ జీ. లక్ష్మీషా

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jul, 2026 - 09:37 PM
112 వీక్షణలు

ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ జీ. లక్ష్మీషా

విస్సన్నపేట, జూలై 20: ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని జిల్లా కలెక్టర్ జీ. లక్ష్మీషా పరిశీలించారు. ఈ సందర్భంగా క్షేత్రంలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, పంటల పెరుగుదల, సేంద్రియ ఎరువుల వినియోగం, జీవామృతం, ఘన జీవామృతం వంటి సహజ వ్యవసాయ విధానాలపై రైతులు, సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు ఖర్చులు తగ్గడంతో పాటు భూమి సారాన్ని పెంచి నాణ్యమైన దిగుబడులు సాధించే అవకాశాలపై కలెక్టర్ వివరాలు సేకరించారు. రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తృతంగా చేపట్టేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.