BREAKING
thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు thumb ● బడికి రక్షణ గోడ లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు thumb ● ఎల్ నినో లో ప్రభావంతో బోర్లు ఏర్పాటుచేసిన సర్పంచ్ గరిక సత్యనారాయణ thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● గుండెపోటుతో మృతి చెందిన క్వారీ వాచ్ మెన్ thumb ● ప్రజా సంక్షేమమే ధ్యేయం.. ఓటు హక్కును వినియోగించుకున్న జెడ్పీటీసీ అభ్యర్థి కె. నరసింహ రెడ్డి thumb ● లద్దిగంలో ప్రశాంతంగా ముగిసిన జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు thumb ● బడికి రక్షణ గోడ లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు thumb ● ఎల్ నినో లో ప్రభావంతో బోర్లు ఏర్పాటుచేసిన సర్పంచ్ గరిక సత్యనారాయణ thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● గుండెపోటుతో మృతి చెందిన క్వారీ వాచ్ మెన్ thumb ● ప్రజా సంక్షేమమే ధ్యేయం.. ఓటు హక్కును వినియోగించుకున్న జెడ్పీటీసీ అభ్యర్థి కె. నరసింహ రెడ్డి thumb ● లద్దిగంలో ప్రశాంతంగా ముగిసిన జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్
Test 4
Date of Publish : 21 September 2026, 08:12 pm
Posted by : SEETHA KIRAN KUMAR

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం సహాయ నిధి నుంచి రూ.10 లక్షల సాయం

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
21 Sep, 2026 - 08:12 PM
49 వీక్షణలు

హనుమకొండ: తెలంగాణ మలిదశ ఉద్యమంలో సేవలందించిన దివంగత లింగాల కేదారి, ఆయన భార్య దివంగత పుష్పలత కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఉద్యమ సమయంలో సేవలు
కుటుంబానికి ఆర్థిక సాయం

హనుమకొండలోని శాంతినగర్, పోస్టల్ కాలనీకి చెందిన కేదారి సెప్టెంబర్ 9, 2026న, ఆయన భార్య పుష్పలత సెప్టెంబర్ 10, 2026న జరిగిన విషాదకర ఘటనలో మృతి చెందినట్లు ప్రభుత్వ ప్రకటనలో పేర్కొన్నారు.

తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో కేదారి దంపతులు అందించిన సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. సాధారణ హోటల్ నిర్వహిస్తూ ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అనే భావనతో ఆహారం వృథా చేయకూడదనే అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించారని తెలిపారు.

ఉద్యమ సమయంలో ఉద్యమకారులకు ఉచితంగా భోజనం, టిఫిన్లు, టీ అందిస్తూ తమ వంతు సహకారం అందించారని పేర్కొన్నారు.

కేదారి దంపతుల కుటుంబాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎం ఓఎస్డీ ద్వారా CMRF నుంచి రూ.10 లక్షల ఆర్థిక సాయం మంజూరైనట్లు ప్రభుత్వ ప్రకటనలో తెలిపారు.

మంజూరైన మొత్తాన్ని అర్హులైన చట్టబద్ధ వారసులు, కుటుంబ సభ్యులకు అందించేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.