మహిళలతో ఘనంగా కుంకుమ పూజ
తెలంగాణ
/
జగిత్యాల
రాయికల్: పట్టణంలోని ఒకటో వార్డులో వందేమాతరం యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి వేడుకల్లో భాగంగా కాలనీ మహిళలతో కుంకుమ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి, కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో 2,000 మందికి పైగా భక్తులు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో యూత్ సభ్యులు లింగపల్లి శంకర్, చిలుక సత్యానంద్, చింతకుంట రాజేష్, ఆడేపు మనోజ్, బద్దినపల్లి ప్రశాంత్, కుంచల ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.