BREAKING
thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో
Date of Publish : 17 September 2026, 07:41 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల పట్ల గౌరవంతో సేవలు అందించాలి...

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
17 Sep, 2026 - 07:41 AM
9 వీక్షణలు

తిరుమల, 

సీఎం ఆదేశాల మేరకు శ్రీవారి సేవకుల సంఖ్యను రెట్టింపు చేస్తాం

శ్రీవారి సేవకులతో ఆత్మీయ సమావేశంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల పట్ల గౌరవం, మర్యాద, ఆప్యాయతతో మెలుగుతూ సేవలు అందించాలని టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు శ్రీవారి సేవకులను కోరారు.

తిరుమల ఆస్థాన మండపంలో బుధవారం టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి వివిధ రాష్ట్రాల నుంచి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సేవలందించేందుకు విచ్చేసిన శ్రీవారి సేవకులతో చైర్మన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీవారి సేవను మరింత బలోపేతం చేసి, సేవకుల సంఖ్యను రెట్టింపు చేసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. భక్తులకు సౌకర్యవంతమైన, ఆప్యాయమైన సేవలు అందించడంలో శ్రీవారి సేవకుల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు.

5,000 ఆలయాలకు శ్రీవారి సేవకులు మూలస్తంభాలుగా నిలవాలి

టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ 5,000 ఆలయాల నిర్మాణానికి సంకల్పించామని, ఈ ఆలయాలకు శ్రీవారి సేవకులు మూలస్తంభాలుగా నిలవాలని కోరారు. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిలో ప్రణాళికాబద్ధంగా హిందూ ధర్మ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

శ్రీవారి సేవను మరింత బలోపేతం చేస్తాం

అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి మాట్లాడుతూ ప్రపంచంలోని ఏ ధార్మిక వ్యవస్థలోనూ ఇంత భారీ స్థాయిలో సేవకుల భాగస్వామ్యం లేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించడం టీటీడీ ప్రధాన సిద్ధాంతమని తెలిపారు.

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆలోచనతో శ్రీవారి సేవ రూపుదిద్దుకుందని, సేవకులకు శిక్షణ అందించి శ్రీవారి సేవను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు.

భక్తుల సేవే శ్రీవారి సేవ

బ్రహ్మోత్సవాల్లో సేవలందించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సేవకులు అంకితభావంతో, క్రమశిక్షణతో, సమన్వయంతో విధులు నిర్వహించి భక్తులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములై, స్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, శ్రీవారి సేవ ఇన్‌చార్జ్, టీటీడీ సీపీఆర్వో డాక్టర్ టి.రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.