BREAKING
thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు దంపతులు thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు దంపతులు thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ
Date of Publish : 13 October 2026, 06:15 pm
Posted by : MUSUGU GOPI

స్థానిక ఎన్నికల నేపథ్యంలో రైట్ గేర్ పరికరాల వినియోగంపై ఎస్పీ సమీక్ష

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
Musugu Gopi Bellamkonda Mandal
13 Oct, 2026 - 06:15 PM
6 వీక్షణలు

పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయం: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసు సిబ్బంది సంసిద్ధత, రైట్ గేర్ పరికరాల వినియోగంపై పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి సమీక్ష నిర్వహించారు. ఎన్నికల విధుల్లో భాగంగా టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు, రక్షణ కవచాలు వంటి పరికరాల వినియోగం, వాటి ప్రాధాన్యం, అవసరమైన సందర్భాల్లో అనుసరించాల్సిన విధానాలపై అధికారులకు సూచనలు చేశారు.

ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణ, అవాంఛనీయ ఘటనల నివారణ, పోలీసు సిబ్బంది సంసిద్ధత, ప్రజలకు భద్రత కల్పించడం వంటి అంశాలపై సమీక్షలో ప్రధానంగా చర్చించారు. పరిస్థితులకు అనుగుణంగా రైట్ గేర్ పరికరాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు.

ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఉన్నతాధికారుల ఆదేశాలు, నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ అవసరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉందని ఎస్పీ తెలిపారు.