BREAKING
thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 27 November 2026, 05:36 pm
Posted by : A. MURALIDHAR

పుదిపట్ల శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా ప్రత్యేక పూజలు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
A. Muralidhar చౌడేపల్లి మండల ప్రతినిధి
27 Nov, 2026 - 05:36 PM
15 వీక్షణలు

పుదిపట్ల, నవంబర్ 27: కార్తీకమాస శుక్రవారం సందర్భంగా అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం పుదిపట్ల గ్రామంలోని స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకురాలు శ్రావణి తెల్లవారుజామున అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనానికి అవకాశం కల్పించారు.

కార్తీకమాస పవిత్ర శుక్రవారం కావడంతో చౌడేపల్లి, పుంగనూరు పట్టణాలతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం సందడిగా మారి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

ఈరోజు నిర్వహించిన పూజా కార్యక్రమాలకు పలమనేరు పట్టణానికి చెందిన మునిరత్నం రెడ్డి, ఆయన భార్య గీత ఉభయదారులుగా వ్యవహరించి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల్లో భాగస్వాములై తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం ఆలయ ధర్మకర్త వినోద్ కుమార్ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

కార్తీకమాసంలో అమ్మవారి దర్శనం, అభిషేకం, ప్రత్యేక పూజల్లో పాల్గొనడం తమకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించిందని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయంలో నిర్వహించే పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ వర్గాలు ఆకాంక్షించాయి.

NTODAY NEWS | ప్రతి క్షణం ప్రజల పక్షం