BREAKING
thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు
Date of Publish : 21 September 2026, 08:09 pm
Posted by : SEETHA KIRAN KUMAR

అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలి: సీఎస్

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
21 Sep, 2026 - 08:09 PM
11 వీక్షణలు

విజిలెన్స్ బృందాలతో నిరంతరం తనిఖీలు, దాడులు

శాఖలో నియామకాలు, పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేయాలి

రాష్ట్ర ఆదాయాన్ని పెంచేలా సమర్థవంతమైన చర్యలు

హైదరాబాద్: రాష్ట్రంలో అక్రమ ఇసుక రవాణా, అక్రమ తవ్వకాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గనులు, భూగర్భ వనరుల శాఖపై సీఎస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. శాఖ పనితీరు, పరిపాలనా అంశాలు, ఆదాయ సమీకరణ, సిబ్బంది నియామకాలు, పదోన్నతులు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.

ఖనిజ వనరులతో ఆదాయం పెంచాలి

రాష్ట్రంలోని ఖనిజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీతో పాటు ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను నిబంధనల మేరకు వేగవంతం చేయాలని సూచించారు.

సిబ్బంది కొరత కారణంగా శాఖ కార్యకలాపాలకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

అక్రమ రవాణాపై నిఘా

రాష్ట్రంలో అక్రమ ఇసుక రవాణా, అక్రమ తవ్వకాలు, అనధికారికంగా ఖనిజాల తరలింపును అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. అక్రమ కార్యకలాపాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నిరంతరం తనిఖీలు నిర్వహించాలని సూచించారు.

విజిలెన్స్ బృందాలతో ఆకస్మిక తనిఖీలు, దాడులు చేపట్టి అక్రమ ఇసుక రవాణా, ఖనిజాల తరలింపునకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. అక్రమ రవాణా, అక్రమ తవ్వకాలపై వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

శాఖలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు.

ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా గనులు, భూగర్భ వనరుల శాఖను మరింత సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు చేపట్టాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే దిశగా సమన్వయంతో పనిచేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో మైన్స్ అండ్ జియాలజీ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, డైరెక్టర్ జనరల్ (విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్) డి.ఎస్. చౌహాన్, ITE&C సంయుక్త కార్యదర్శి, మైన్స్ డైరెక్టర్ అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.