BREAKING
thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● శ్రేయాన్వికి జన్మదిన శుభాకాంక్షలు.. శాలువాతో ఘన సన్మానం thumb ● విద్య, వైద్యం, సామాజిక సేవే ఆది జాంబవ సేవ సంస్థ లక్ష్యం thumb ● ప్రజలందరి జీవితాల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుభిక్షం వెల్లివిరియాలి thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● శ్రేయాన్వికి జన్మదిన శుభాకాంక్షలు.. శాలువాతో ఘన సన్మానం thumb ● విద్య, వైద్యం, సామాజిక సేవే ఆది జాంబవ సేవ సంస్థ లక్ష్యం thumb ● ప్రజలందరి జీవితాల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుభిక్షం వెల్లివిరియాలి
Test 4
Date of Publish : 24 November 2026, 02:19 pm
Posted by : K MAHESH

రూ.5 లక్షల ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / సంస్థాన్ నారాయణపూర్
Reporter
K Mahesh Munugodu Constituency
24 Nov, 2026 - 02:19 PM
6 వీక్షణలు

అర్హులైన ప్రతి కుటుంబం దరఖాస్తు చేసుకోవాలి: సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి

సంస్థాన్ నారాయణపురం, ఎన్ టుడే న్యూస్:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని నారాయణపురం గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి సూచించారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబం ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ భరోసాను పొందాలని ఆమె పిలుపునిచ్చారు.

రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని సర్పంచ్ తెలిపారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి మరణించిన సందర్భంలో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా రూ.5 లక్షల బీమా సాయం అందించడం ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తుందని వివరించారు.

లబ్ధిదారులకు బీమా రసీదుల పంపిణీ

ఈ సందర్భంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సర్పంచ్ బీమా రసీదులను అందజేశారు. పథకం ప్రయోజనాలపై గ్రామ ప్రజలు అవగాహన పెంచుకోవాలని, అర్హత కలిగిన ప్రతి కుటుంబం దరఖాస్తు చేసుకునేలా ముందుకు రావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పల్లె మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ కోన్‌రెడ్డి నర్సింహ, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బద్దుల మురళి యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉప్పల రాజయ్య, గ్రామ శాఖ సహాయ కార్యదర్శి రేవనపల్లి గోపాల్, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఉప్పల నాగరాజు, పల్లె ఆనంద్ గౌడ్, కొంశెట్టి రవి, వడ్డేపల్లి శివప్రసాద్, బానోతు కిరణ్ నాయక్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.