ఏపీకి తమిళనాడు సీఎం విజయ్.. చంద్రబాబుతో కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ పర్యటనకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రానున్నట్లు సమాచారం. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన, సాయంత్రం 4:15 గంటలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో రాజకీయ, అభివృద్ధి అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకోనున్నారు. రాత్రి 8:30 గంటలకు తిరిగి చెన్నైకి బయలుదేరనున్నట్లు సమాచారం.