వరంగల్ లో ఒక హోటల్ లో పేకాట ఆడుతున్న 8 మందిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసారు..
తెలంగాణ
/
వరంగల్
- ఎనిమిది మంది అరెస్ట్.. రూ.55,280 నగదు
- సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం
వరంగల్ (ఎన్ టుడే న్యూస్): వరంగల్ ఎస్‌వీపీ రోడ్డులోని భిల్వా ఇన్ హోటల్‌లో పేకాట ఆడుతున్న స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుల నుంచి రూ.55,280 నగదు, పేకాట ముక్కలు, ఎనిమిది సెల్‌ఫోన్లు, ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టు చేసిన ఎనిమిది మందిని తదుపరి చర్యల నిమిత్తం మట్వాడ పోలీసులకు అప్పగించినట్లు ఏసీపీ మధుసూదన్ వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి చర్యలు చేపట్టారు.