BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్
Date of Publish : 03 August 2026, 08:50 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణలో చారిత్రక కట్టడాల పరిరక్షణకు కేంద్రం ప్రాధాన్యం

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Aug, 2026 - 08:50 PM
38 వీక్షణలు

తెలంగాణలో చారిత్రక కట్టడాల పరిరక్షణకు కేంద్రం ప్రాధాన్యం

న్యూఢిల్లీ, ఆగస్టు 3: తెలంగాణలో చారిత్రక కట్టడాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వెల్లడించారు. లోక్‌సభలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా దేశవ్యాప్తంగా 3,688 కేంద్ర రక్షిత స్మారక చిహ్నాలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ సర్కిల్ పరిధిలో 2021-22 నుంచి 2025-26 వరకు చారిత్రక కట్టడాల సంరక్షణకు నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. 2021-22లో రూ.7 కోట్లుగా ఉన్న కేటాయింపులు 2022-23లో రూ.15.50 కోట్లకు పెరగగా, 2025-26లో రూ.14.93 కోట్లు కేటాయించినట్లు వివరించారు. అలాగే 'అడాప్ట్ ఎ హెరిటేజ్ 2.0' కార్యక్రమం ద్వారా చారిత్రక ప్రదేశాల్లో వసతుల మెరుగుదలకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

పాఠశాలల్లో డిజిటల్ విద్య విస్తరణకు కేంద్రం చర్యలు

జాతీయ విద్యా విధానం–2020 అమలులో భాగంగా పాఠశాలల్లో డిజిటల్ విద్యను విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి జయంత్ చౌదరి తెలిపారు. తెలంగాణలో 41,762 ఎంపిక చేసిన పాఠశాలల్లో 2,104 స్మార్ట్ తరగతి గదులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే 20,490 పాఠశాలలకు కంప్యూటర్ సౌకర్యం, 15,535 పాఠశాలలకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. డిజిటల్ బోధనపై ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని, 2020-21లో 2,980 మంది శిక్షణ పొందగా, 2021-22లో 75,735 మంది, 2022-23లో 31,273 మంది, 2023-24లో 448 మంది, 2024-25లో 16,618 మంది, 2025-26లో 22,519 మంది ఉపాధ్యాయులు డిజిటల్ శిక్షణ పూర్తి చేసినట్లు వివరించారు.