భగత్ సింగ్ జయంతి వేడుకలు విప్లవవీరుడు భగత్ సింగ్ జయంతి వేడుకలు
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ మధిర మండల సమితుల ఆధ్వర్యంలో సోమవారం విప్లవవీరుడు భగత్ సింగ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం నిర్వహించిన సభలో నాయకులు మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం భగత్ సింగ్ చేసిన పోరాటం, ఆయన త్యాగం భారతదేశ చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు. యువతలో దేశభక్తి, సామాజిక బాధ్యత పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. చిన్ననాటి నుంచే భగత్ సింగ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశం పట్ల బాధ్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మధిర మండల సహాయ కార్యదర్శి గుగులోత్ హుస్సేన్, ఏఐవైఎఫ్ మధిర మండల కార్యదర్శి సంపసాల సాయి, మండల నాయకులు లోకేష్, సంతోష్, గౌతమ్, కార్తీక్, వెంకట్, అశోక్, గోపి, మోహన్ క్రాంతి, విగ్నేష్ తదితరులు పాల్గొన్నారు.