ఓటు హక్కును వినియోగించుకున్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
NTODAY NEWS: చిట్యాల
స్థానిక పంచాయతీ ఎన్నికల సందర్భంగా గురువారం చిట్యాల మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికలలో ఓటర్లు ఆలోచించి స్థానికంగానే ఉండి ప్రజల గ్రామ సమస్యలపై పూర్తి అవగాహన కలిగి వాటిని పరిష్కరించేందుకు కృషి చేసే వ్యక్తులను ఓటు వేసి గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును ప్రజాస్వామ్యబద్ధంగా వినియోగించుకొవాలని సూచించారు. ఆయనతోపాటు ఆయన సతీమణి అరుంధతి, సోదరుడు మాజీ నార్ముక్స్ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి, తెలంగాణ డైరీ చైర్మన్ అమిత్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు.














