BREAKING
టీబీ నిర్ధారణ శిబిరం ను ప్రారంభించిన స్థానిక సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్. శ్రీశైలం పారిశుధ్య కార్మికుల 68 మంది సమస్యలను పరిష్కరించండి టమాట పది రూపాయలు మహిళా బిల్లును అడ్డుకుంటున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతాం అత్యవసర హెచ్చరిక జారీ చేయబడింది… ​తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలి కొలుసు పార్థసారథి జన్మదినం పురస్కరించుకుని సూరంపాలెంలో కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభం భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో. వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం టీబీ నిర్ధారణ శిబిరం ను ప్రారంభించిన స్థానిక సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్. శ్రీశైలం పారిశుధ్య కార్మికుల 68 మంది సమస్యలను పరిష్కరించండి టమాట పది రూపాయలు మహిళా బిల్లును అడ్డుకుంటున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతాం అత్యవసర హెచ్చరిక జారీ చేయబడింది… ​తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలి కొలుసు పార్థసారథి జన్మదినం పురస్కరించుకుని సూరంపాలెంలో కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభం భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో. వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం
www.ntodaynews.com

తెలంగాణలో భూస్వాముల దౌర్జన్యాలను ఎదిరించి పోరాడిన చరిత్ర ఎర్రజెండాదే

తెలంగాణ
16 Sep, 2025 - 06:48 PM
156 వీక్షణలు
తెలంగాణలో భూస్వాముల దౌర్జన్యాలను ఎదిరించి పోరాడిన చరిత్ర ఎర్రజెండాదే మహత్తర పోరాటానికి మతంరంగు పులుముతున్న బిజెపి చార్మినార్ సీపీఎం సభలో ఎం.డి అబ్బాస్ NTODAY NEWS: హైదరాబాద్ తెలంగాణలో భూస్వాముల దౌర్జన్యాలకు, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా సామాన్య ప్రజలను చైతన్య పరిచి సాయుధ పోరాటం నిర్వహించిన చరిత్ర ఎర్రజెండా దేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం డీ అబ్బాస్ అన్నారు. నేడు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా సిపిఎం హైదరాబాద్ సౌత్ జిల్లా కమిటి శాలిబండ నుండి చార్మినార్ వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం చార్మినార్ వద్ద సభ నిర్వహించారు. సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగం చేశారు. ఆయన ఈ సభలో మాట్లాడుతూ 4000 మంది ప్రాణత్యాగాలతో, లక్షల ఎకరాల భూస్వాముల భూముల్ని స్వాదీనం చేసుకుని పేదలకు పంపిణీ చేసిన ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటానికి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం వహించిందన్నారు. భూస్వాములను గ్రామాలనుండి తరిమి కొట్టి, గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటు చేసి, ప్రజాపాలన అంటే ఏమిటో ప్రజలకు చూపించారు కమ్యూనిస్టులని అన్నారు. వెట్టిచాకిరీని కమ్యూనిస్టు పార్టీ నిర్మూలించింది, పన్నుల చెల్లింపు నిలిపివేశారు. ఫలితంగా నైజామ్ రాజుకు దిక్కు తోచక ఇండియన్ గవర్నమెంటుతో రాజీ కుదుర్చుకున్నాడని దానిలో భాగంగానే ఆనాటి కేంద్ర కాంగ్రెస్ హోమ్ మంత్రి వల్లభాయ్ పటేల్ సైన్యాన్ని పంపించాడని, కమ్యూనిస్టు ఉద్యమాన్ని అణచివేసి, ప్రజలు సాధించిన విజయాలను కాలరాసేందు భూస్వాములతో కలిసి కుట్ర చేశారని తెలిపారు. నిజామ్ రాజుకు రాజాభరణాలు ఇచ్చారని, ఇదీ చరిత్ర అని, ఈ వాస్తవాలు నేటి తరానికి చెప్పాలని అన్నారు. బిజెపి ఈ చరిత్రకు మతం రంగు పులిమి ముస్లిం రాజుకు, హిందువులకు జరిగిందని అబద్ధాలు చెప్తున్నదని బిజెపి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాటి చారిత్రక పోరాటంతో ఎలాంటి సంబంధం లేని బిజెపి విమోచన దినం పేరుతో హడావుడి చేయడం సిగ్గుచేటన్నారు. బిజేపి అబద్ధాలను ప్రజలలో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. చార్మినార్ జోన్ సిపిఎం కన్వీనర్ అబ్దుల్ సత్తార్ అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా నాయకులు ఎం మీనా, జి. విటల్, పి. నాగేశ్వర్, ఎల్. కోటయ్య, ఎం శ్రవణ్ కుమార్,ఎం. బాలు, బాబార్ ఖాన్, ఎస్‌ కిషన్, ఏ కృష్ణ, కే.జంగయ్య, మరియు ప్రజా సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు. ఎర్ర జెండాలు పట్టుకొని సిపిఎం శ్రేణులు నిర్వహించిన ర్యాలీ ఆ ప్రాంత ప్రజలను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నది. Follow us on Website Facebook Instagram YouTube