BREAKING
thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● శ్రేయాన్వికి జన్మదిన శుభాకాంక్షలు.. శాలువాతో ఘన సన్మానం thumb ● విద్య, వైద్యం, సామాజిక సేవే ఆది జాంబవ సేవ సంస్థ లక్ష్యం thumb ● ప్రజలందరి జీవితాల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుభిక్షం వెల్లివిరియాలి thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● శ్రేయాన్వికి జన్మదిన శుభాకాంక్షలు.. శాలువాతో ఘన సన్మానం thumb ● విద్య, వైద్యం, సామాజిక సేవే ఆది జాంబవ సేవ సంస్థ లక్ష్యం thumb ● ప్రజలందరి జీవితాల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుభిక్షం వెల్లివిరియాలి
Test 4
Date of Publish : 24 November 2026, 03:04 pm
Posted by : PAGADALA DEVAIAH

ఢిల్లీ ఆక్యుపై మహాధర్నాను జయప్రదం చేయాలి

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
24 Nov, 2026 - 03:04 PM
4 వీక్షణలు

బతుకమ్మ కుంట లేబర్ అడ్డాపై సీఐటీయూ అంబర్‌పేట నియోజకవర్గ కమిటీ పోస్టర్ ఆవిష్కరణ

హైదరాబాద్, నవంబర్ 24, ఎన్ టుడే న్యూస్:

కార్మిక సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించనున్న ‘చలో ఆక్యుపై ఢిల్లీ’ మహాధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ అంబర్‌పేట నియోజకవర్గ కమిటీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను అంబర్‌పేట నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ కుంట లేబర్ అడ్డాపై ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సీఐటీయూ అంబర్‌పేట జోన్ కన్వీనర్ జి. రాములు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. కార్మికులకు రక్షణగా ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, యజమానులు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చిందని ఆరోపించారు. ఈ విధానాలు కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

కార్మికులు పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినానికి బదులుగా 12 గంటల పని విధానాన్ని ప్రోత్సహించేలా లేబర్ కోడ్స్ ఉన్నాయని ఆయన విమర్శించారు. కార్మికులకు పని భద్రత, శ్రమకు తగిన వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాన్ని రూ.42 వేలకు పెంచి అమలు చేయాలని కోరారు.

అసంఘటిత రంగ కార్మికులకు పని గ్యారంటీ కల్పించాలని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని రాములు డిమాండ్ చేశారు. పట్టణాల్లోని లేబర్ అడ్డాలపై పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులకు పట్టణ ఉపాధి హామీ పథకం కింద సంవత్సరానికి 200 రోజుల పని కల్పించాలని కోరారు.

లేబర్ అడ్డాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి

కార్మిక అడ్డాల్లో మంచినీరు, మూత్రశాలలు, ఐదు రూపాయలకే భోజనం వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఢిల్లీలో జరిగే మహాధర్నాలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రాములు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జోన్ కమిటీ సభ్యుడు ఎల్. సోమయ్యతో పాటు లేబర్ అడ్డా కార్మికులు మాలోతి ఈర్య, సురేష్, వినోద్, లలిత, బోడ శీను, రాజన్న, కొమ్మాలు తదితరులు పాల్గొన్నారు.