BREAKING
thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 27 November 2026, 06:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కొత్త రావిచర్ల గ్రామ పాలకవర్గం ఏకగ్రీవం..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Nov, 2026 - 06:34 PM
39 వీక్షణలు

సర్పంచ్‌గా బార్లపూడి ఎస్సయ్య, ఉపసర్పంచ్‌గా లావు దొరబాబు ఎన్నిక

నూజివీడు, ఏలూరు జిల్లా: నూజివీడు మండలం కొత్త రావిచర్ల గ్రామంలో నూతన గ్రామ పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. గ్రామంలో ఐక్యతకు పెద్దపీట వేస్తూ సర్పంచ్‌తో పాటు ఉపసర్పంచ్ ఎంపిక కూడా ఏకగ్రీవంగా జరగడంతో గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. గ్రామ సర్పంచ్‌గా బార్లపూడి ఎస్సయ్య ఎన్నిక కాగా, నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యుల సమక్షంలో, నూజివీడు మండల ఎంపీపీ కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉపసర్పంచ్‌గా లావు దొరబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ పాలనలో కీలక బాధ్యతలు చేపట్టిన నూతన పాలకవర్గం ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యతను స్వీకరించింది. గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడం, మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, వీధి దీపాలు వంటి అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని గ్రామస్థులు ఆకాంక్షిస్తున్నారు. ఏకగ్రీవ ఎన్నికతో గ్రామ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేసేందుకు మంచి అవకాశం ఏర్పడిందని నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ బార్లపూడి ఎస్సయ్య, ఉపసర్పంచ్ లావు దొరబాబుతో పాటు వార్డు సభ్యులకు పలువురు నాయకులు, గ్రామస్థులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ ముల్లంగి మోషే, పార్టీ అధ్యక్షుడు లావు మురళీమోహన్, మాజీ ఎంపీటీసీలు లావు ప్రసాద్ బాబు, వెనిగల్ల సాంబశివరావు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నూతన పాలకవర్గం రాజకీయాలకు అతీతంగా గ్రామ ప్రజలందరినీ కలుపుకొని అభివృద్ధి పథంలో కొత్త రావిచర్లను ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు.