BREAKING
thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు thumb ● బడికి రక్షణ గోడ లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు thumb ● ఎల్ నినో లో ప్రభావంతో బోర్లు ఏర్పాటుచేసిన సర్పంచ్ గరిక సత్యనారాయణ thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● గుండెపోటుతో మృతి చెందిన క్వారీ వాచ్ మెన్ thumb ● ప్రజా సంక్షేమమే ధ్యేయం.. ఓటు హక్కును వినియోగించుకున్న జెడ్పీటీసీ అభ్యర్థి కె. నరసింహ రెడ్డి thumb ● లద్దిగంలో ప్రశాంతంగా ముగిసిన జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు thumb ● బడికి రక్షణ గోడ లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు thumb ● ఎల్ నినో లో ప్రభావంతో బోర్లు ఏర్పాటుచేసిన సర్పంచ్ గరిక సత్యనారాయణ thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● గుండెపోటుతో మృతి చెందిన క్వారీ వాచ్ మెన్ thumb ● ప్రజా సంక్షేమమే ధ్యేయం.. ఓటు హక్కును వినియోగించుకున్న జెడ్పీటీసీ అభ్యర్థి కె. నరసింహ రెడ్డి thumb ● లద్దిగంలో ప్రశాంతంగా ముగిసిన జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్
Test 4
Date of Publish : 21 September 2026, 08:15 pm
Posted by : SEETHA KIRAN KUMAR

రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి

అంతర్జాతీయం అంతర్జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
21 Sep, 2026 - 08:15 PM
44 వీక్షణలు

మాస్కో: రష్యాపై ఉక్రెయిన్ భారీ స్థాయిలో డ్రోన్ దాడులు చేపట్టింది. ముఖ్యంగా మాస్కో, పరిసర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పెద్ద సంఖ్యలో డ్రోన్లు దూసుకొచ్చినట్లు రష్యా అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో పలు ప్రాంతాల్లో పేలుళ్లు, మంటలు సంభవించగా, మాస్కోలోని చమురు శుద్ధి కేంద్రానికి కూడా నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు.

రష్యా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం నుంచి రష్యా వైపు దూసుకొచ్చిన 1,600కు పైగా డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. వీటిలో సుమారు 450 డ్రోన్లు మాస్కో వైపు వచ్చినట్లు మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ తెలిపారు. దాడుల్లో ముగ్గురు మృతి చెందినట్లు రష్యా అధికారులు వెల్లడించారు.

మరోవైపు ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలపై రష్యా డ్రోన్ దాడులు కొనసాగించింది. కీవ్ ప్రాంతంతో పాటు జపొరిజ్జియా, ఇతర ప్రాంతాల్లో రష్యా దాడులు జరిగినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. కీవ్ ప్రాంతంలో ముగ్గురు చిన్నారులు సహా పలువురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడికి ప్రతిస్పందనగా కీవ్‌పై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని రష్యా ప్రకటించింది. దీంతో ఇరుదేశాల మధ్య సుదూర డ్రోన్ దాడులు మరింత ఉధృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.