జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ గారు,.వైసీపీ నాయకులు, పలువురు.ప్రముఖులు
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ గారు..!
దివంగత శ్రీ వంగవీటి మోహన రంగా గారి తనయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
జనసేన పార్టీలోకి వైసీపీ నాయకులు, పలువురు ప్రముఖులు
జనసేన పార్టీలోకి వైసీపీ నాయకులు, విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు బుధవారం సాయంత్రం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో చేరారు. బుధవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వీరికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో వైసీపీ నేత, శ్రీకాకుళం మాజీ డీసీసీబీ చైర్మన్ శ్రీ డోలా జగన్, తిరుపతికి చెందిన శ్రీ పెనుమాదు ప్రణీత్, ఆచంటకు చెందిన జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు శ్రీ తుంగ నాగేశ్వరరావు, విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు శ్రీ ఏడీఎస్ ప్రసాద్, శ్రీ మారుతి, శ్రీ దోవరీ అమర్నాథ్ లు ఉన్నారు. వీరిని పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం వారితో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జనసేన పార్టీ ఆశయాలను బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. ప్రజాక్షేత్రంలో నిస్వార్థంగా కష్టపడదామని స్పష్టం చేశారు.