BREAKING
thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్
Date of Publish : 14 October 2026, 09:37 pm
Posted by : PAGADALA DEVAIAH

కాప్రా చెరువు అవుట్‌లెట్ పనులకు మరో రూ.7 కోట్లు మంజూరు చేయాలి

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
14 Oct, 2026 - 09:37 PM
15 వీక్షణలు

బి.ఎన్.రెడ్డినగర్: కాప్రా చెరువు అవుట్‌లెట్ నిర్మాణ పనులను వచ్చే వర్షాకాలంలోపు పూర్తి చేసి, దిగువ ప్రాంతాల కాలనీలకు వరద ముంపు సమస్య నుంచి ఉపశమనం కల్పించాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధికారులను కోరారు.

బి.ఎన్.రెడ్డినగర్ డివిజన్ పరిధిలోని హరిహరపురం కాలనీలో ఉన్న కాప్రా చెరువు అవుట్‌లెట్ పనుల కోసం గతంలో రూ.5 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో కుమ్మరికుంట నుంచి మిలేనియం కాలనీ వరకు పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మిలేనియం కాలనీ నుంచి కాప్రా చెరువు వరకు మిగిలిన పనులకు మరో రూ.7 కోట్ల మేర నిధులు అవసరమని, వాటి మంజూరు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జోనల్ కమిషనర్ వికాస్ మహాతోతో కలిసి కాప్రా చెరువు పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. మిలేనియం కాలనీ నుంచి కాప్రా చెరువు వరకు అవుట్‌లెట్ నిర్మాణ పనుల కోసం రూ.7 కోట్లు మంజూరు చేయాలని జోనల్ కమిషనర్‌ను కోరారు. వచ్చే వర్షాకాలానికి ముందే పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.

కాప్రా చెరువు అవుట్‌లెట్ నిర్మాణం పూర్తయితే శాతవాహన నగర్, సాయి గార్డెన్, గాంధీనగర్, గాంధీనగర్ సౌత్, స్నేహమయి నగర్, అఖిలాండేశ్వరి నగర్, పీవీఆర్ కాలనీ, సామానగర్‌తో పాటు ఇతర కాలనీలకు వరద ముంపు సమస్య తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.

దీనిపై జోనల్ కమిషనర్ వికాస్ మహాతో స్పందిస్తూ, పనులకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే పంపించామని, త్వరలోనే పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ పర్యటనలో బి.ఎన్.రెడ్డినగర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కటిక రెడ్డి అరవింద రెడ్డి, అనిల్ చౌదరి, రాఘవేంద్రరావు, పోగుల రాంబాబు, సందీప్‌తో పాటు వివిధ కాలనీల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.