BREAKING
thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ
Test 4
Date of Publish : 28 November 2026, 08:52 am
Posted by : A. MURALIDHAR

తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
A. Muralidhar చౌడేపల్లి మండల ప్రతినిధి
28 Nov, 2026 - 08:52 AM
30 వీక్షణలు

అన్నమయ్య జిల్లా:

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి, తిరుచానూరులోని పద్మావతి అమ్మవారికి అలంకరించే వివిధ రకాల బంగారు ఆభరణాలను వజ్రాలు, వైడూర్యాలు, మాణిక్యాలతో ప్రత్యేకంగా రూపొందించినట్లు దాత వర్ధమాన్ జైన్‌కు సంబంధించిన వివరాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆభరణాల విలువ సుమారు రూ.160 కోట్లుగా పేర్కొనబడింది.

వర్ధమాన్ జైన్ యాక్సెస్ హెల్త్‌కేర్ సంస్థ వ్యవస్థాపకుడు, వైస్ చైర్మన్‌గా ఉన్నారు. హెల్త్‌కేర్ టెక్నాలజీ, బీపీఓ రంగాల్లో ఆయనకు విశేష అనుభవం ఉంది. గతంలో డెల్ సర్వీసెస్ బీపీఓ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. విజన్ హెల్త్‌సోర్స్ సహ వ్యవస్థాపకుడిగా, ఆసియా ఇంజనీరింగ్ సంస్థలో సహ యజమాని, డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు.

రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ టెక్నాలజీ, ఇమేజ్ ప్రాసెసింగ్, మెడికల్ కోడింగ్ వంటి రంగాల్లో ఆయనకు అనుభవం ఉంది. లయోలా కళాశాలలో స్టాటిస్టిక్స్ చదివిన ఆయన, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.

కంచి కామకోటి చైల్డ్ ట్రస్ట్ ఆసుపత్రి మేనేజింగ్ ట్రస్టీగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పేద యువత నైపుణ్యాభివృద్ధి కోసం ఒక సంస్థను ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేపడుతున్నారు. శ్రీ సరిత జైన్ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైద్య, విద్యా రంగాల్లో సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతగా గుర్తింపు పొందారు.