BREAKING
thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ
Test 4
Date of Publish : 28 November 2026, 10:28 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చిన్నంపేటలో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Nov, 2026 - 10:28 PM
18 వీక్షణలు

అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు పూలే.. ఆయన ఆశయాల సాధనే నిజమైన నివాళి

చాట్రాయి: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామంలోని అప్పారావు ట్యాంకు వద్ద శనివారం ఉపాధి హామీ కూలీల ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కొమ్ము సుజనారావు పూలమాలలు వేసి మహనీయుడిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ మేట్లు కొమ్ము ఆనందం, జయరాజు, పుల్లారావు తదితరులు మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం జీవితాంతం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే అని కొనియాడారు. కుల వివక్ష, సామాజిక అసమానతలు, అంటరానితనం వంటి దురాచారాలకు వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటం సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. మహిళా విద్యకు ప్రాధాన్యతనిస్తూ తన సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి విద్యా వ్యాప్తికి విశేష కృషి చేశారని గుర్తుచేశారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, విద్య, గౌరవం లభించాలనే లక్ష్యంతో పూలే దంపతులు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. నేటి తరాలు మహాత్మ జ్యోతిరావు పూలే జీవిత చరిత్రను తెలుసుకోవడంతో పాటు ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. కేవలం వర్ధంతి వేడుకలు నిర్వహించడమే కాకుండా ఆయన చూపిన సామాజిక న్యాయం, సమానత్వం, విద్యాభివృద్ధి మార్గంలో నిరంతరం పనిచేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.