BREAKING
thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ
Test 4
Date of Publish : 28 November 2026, 08:09 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మహిళలకు సమాన హక్కులు, గౌరవం, భద్రత కల్పించినప్పుడే నిజమైన సాధికారత

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Nov, 2026 - 08:09 PM
13 వీక్షణలు

మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డా. రాయపాటి శైలజ

అమరావతి: మహిళా సాధికారత అంటే కేవలం అవకాశాలు కల్పించడం మాత్రమే కాదని, సమాజంలోని అన్ని రంగాల్లో మహిళలకు సమాన హక్కులు, గౌరవం, స్వేచ్ఛ, భద్రత కల్పించినప్పుడే నిజమైన సాధికారత సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డా. రాయపాటి శైలజ స్పష్టం చేశారు. మహిళలు అన్ని రంగాల్లో స్వతంత్రంగా ఎదిగేందుకు సమాజం సంపూర్ణ సహకారం అందించాలని పిలుపునిచ్చారు. లాంలోని చలపతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాలలో శనివారం నిర్వహించిన జాతీయ స్థాయి యువజనోత్సవం–2026 కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మహిళా సాధికారత, మహిళల భద్రత, సమానత్వం, సామాజిక బాధ్యత వంటి అంశాలపై కీలక సందేశాన్ని అందించారు. విద్య, ఉద్యోగం, రాజకీయాలు, విజ్ఞానం, వ్యాపారం, కళలు, క్రీడలు తదితర రంగాల్లో మహిళలు తమ ప్రతిభను చాటుకుంటూ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని శైలజ పేర్కొన్నారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు కుటుంబ సభ్యులు, విద్యాసంస్థలు, సమాజం ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళల నిర్ణయాలను గౌరవిస్తూ, వారు స్వతంత్రంగా ఎదిగేందుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. మహిళలపై జరుగుతున్న వేధింపులు, వివక్ష, హింస, అసభ్య ప్రవర్తన వంటి సమస్యలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు. మహిళల పట్ల గౌరవభావం చిన్ననాటి నుంచే పిల్లల్లో పెంపొందించాలని, సమానత్వ భావన కుటుంబ స్థాయి నుంచే ప్రారంభం కావాలని అభిప్రాయపడ్డారు. మహిళల భద్రత అనేది కేవలం మహిళల బాధ్యత మాత్రమే కాదని, పురుషులు, కుటుంబాలు, విద్యాసంస్థలు, సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన సామూహిక బాధ్యత అని స్పష్టం చేశారు. మహిళలు తమపై జరిగే అన్యాయాలు, వేధింపులను భయపడకుండా బయటపెట్టాలని, అవసరమైన సహాయం పొందేలా అవగాహన కల్పించాలని సూచించారు. బాధితులకు అండగా నిలుస్తూ, వేధింపులకు వ్యతిరేకంగా ధైర్యంగా స్పందించే సామాజిక వాతావరణం ఏర్పడాలని ఆకాంక్షించారు. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యత, నైతిక విలువలు, పరస్పర గౌరవం, సమానత్వ భావనలను అలవర్చుకోవాలని సూచించారు. మహిళల గౌరవం, భద్రతకు పెద్దపీట వేసే సమాజ నిర్మాణంలో యువత చురుకైన పాత్ర పోషించాలని డా. రాయపాటి శైలజ పిలుపునిచ్చారు.