BREAKING
thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ
Test 4
Date of Publish : 28 November 2026, 09:37 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఉప్పల్‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 30 ఏళ్ల మహిళ మృతి..

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
28 Nov, 2026 - 09:37 PM
22 వీక్షణలు

వైద్యుల నిర్లక్ష్యమంటూ కుటుంబ సభ్యుల ఆందోళన

హైదరాబాద్: ఉప్పల్ భరత్‌నగర్‌కు చెందిన సౌజన్య (30) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం కలకలం రేపింది. రక్తంలో ఇన్‌ఫెక్షన్‌తో నాగోల్ రోడ్డులోని ఆస్పత్రిలో చేరిన ఆమె శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.

వివరాల ప్రకారం.. ఈ నెల 26వ తేదీన రక్తంలో ఇన్‌ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్న సౌజన్యను కుటుంబ సభ్యులు నాగోల్ రోడ్డులోని సుమిత్ర ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే శనివారం ఉదయం వరకు ఆరోగ్యంగానే ఉన్న ఆమె కొద్దిసేపటికే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

సౌజన్య మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, వైద్యుల నిర్లక్ష్యమే మరణానికి కారణమని ఆరోపించారు. ఈ మేరకు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. చికిత్స సమయంలో ఏం జరిగిందనే విషయంపై స్పష్టత ఇవ్వాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేశారు.

సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సౌజన్య మృతికి గల కారణాలు, కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణల్లో వాస్తవాలను విచారణ అనంతరం వెల్లడించాల్సి ఉంది.