BREAKING
thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ
Test 4
Date of Publish : 28 November 2026, 08:17 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఘట్‌కేసర్‌లో హోటల్ గదిలో యువకుడి అనుమానాస్పద మృతి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
28 Nov, 2026 - 08:17 PM
21 వీక్షణలు

మేడ్చల్ జిల్లా: ఘట్‌కేసర్ పరిధిలోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. గుంటూరుకు చెందిన కోట శ్రీరామ్ (29) చౌదరిగూడలోని లివింగ్ ట్రీ ఓయూ హోటల్ గదిలో విగతజీవిగా కనిపించాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన కోట శ్రీరామ్ అక్కడి ఓ ప్రైవేట్ థియేటర్‌లో కస్టమర్ కేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే థియేటర్‌కు చెందిన నగదు, మొబైల్ ఫోన్ తీసుకెళ్లడంతో పాటు, ఫోన్‌పే ద్వారా రూ.99,999 తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకున్నాడని థియేటర్ యజమాని ఆరోపించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై యజమాని ఫిర్యాదు చేయడంతో శ్రీరామ్ బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేసినట్లు తెలిసింది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 27వ తేదీన శ్రీరామ్ తన పరిస్థితిని వివరిస్తూ తల్లికి, థియేటర్ యజమానికి వీడియో సందేశం పంపినట్లు సమాచారం. అంతేకాకుండా తాను బస చేసిన హోటల్ లొకేషన్‌ను కూడా వారికి షేర్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే హోటల్ సిబ్బంది గదిలోకి వెళ్లి పరిశీలించగా శ్రీరామ్ మృతి చెంది కనిపించాడు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.

శ్రీరామ్ మృతికి గల కారణాలు, హోటల్ గదిలో చోటుచేసుకున్న పరిణామాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం, ఇతర విచారణ వివరాల ఆధారంగా మరణానికి సంబంధించిన పూర్తి కారణాలు వెల్లడికానున్నాయి.