BREAKING
thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ
Test 4
Date of Publish : 28 November 2026, 09:22 pm
Posted by : కూనురు మధు

పోలీస్ అధికారులు క్రమశిక్షణ, నిజాయితీతో విధులు నిర్వహించాలి

తెలంగాణ
/ నల్గొండ
28 Nov, 2026 - 09:22 PM
37 వీక్షణలు

శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దు.. మల్టీ జోన్-2 ఐజీ షాహనాజ్ ఖాసీం

NTODAY NEWS. నల్లగొండ, 

 పోలీస్ అధికారులు, సిబ్బంది క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మల్టీ జోన్-2 ఐజీ షాహనాజ్ ఖాసీం ఐపీఎస్ సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని, ప్రజల రక్షణే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. శనివారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన ఐజీ.. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్‌తో కలిసి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని డాగ్ స్క్వాడ్, మోటార్ ట్రాన్స్‌పోర్ట్ (ఎం.టి.), డీపీఓ తదితర విభాగాలను తనిఖీ చేశారు. ఆయా విభాగాల పనితీరు, నిర్వహణ, సిబ్బందికి అందుబాటులో ఉన్న వసతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి శాంతిభద్రతలు, నేర నియంత్రణ, కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసులు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. మట్కా, జూదం, గ్యాంబ్లింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పునరావృత నేరాలకు పాల్పడే వారిపై నిఘా ఉంచాలని సూచించారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా విద్యాసంస్థలు, గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నేరాలు, దొంగతనాల నియంత్రణకు నిరంతర పెట్రోలింగ్, నాకాబందీ నిర్వహించాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై నిఘా పెట్టాలని తెలిపారు. చైన్ స్నాచింగ్‌లు, ఇళ్ల దొంగతనాలు, ఇతర ఆస్తి సంబంధిత నేరాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌పై కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఐజీ సూచించారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, అధికారులు గ్రామాలను సందర్శిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని అన్నారు. ప్రజలతో మమేకమై పనిచేసినప్పుడే పోలీస్ వ్యవస్థపై నమ్మకం, విశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు.

నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ 

జిల్లా పోలీస్ కార్యాలయ సందర్శన అనంతరం ఐజీ నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, నిర్వహణ, సిబ్బంది పనితీరు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతిని పరిశీలించారు. ఫిర్యాదుదారులతో గౌరవంగా వ్యవహరిస్తూ కేసుల దర్యాప్తులో నాణ్యత, వేగం పాటించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, డీఎస్పీలు మల్లారెడ్డి, శివరామిరెడ్డి, శ్రీనివాసరావు, రవి, లక్ష్మీనారాయణ, ప్రొబేషనరీ డీఎస్పీలు సైలేష్, అఖిల్, ఎల్. శ్రీకాంత్, ఎం. శ్రీకాంత్‌తో పాటు పలువురు పోలీస్ అధికారులు, సీఐలు, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.