BREAKING
thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ
Test 4
Date of Publish : 28 November 2026, 09:08 pm
Posted by : SHAIK CHAND BASHA

రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
Shaik Chand Basha Pulivendula Constituency Reporter
28 Nov, 2026 - 09:08 PM
18 వీక్షణలు

పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్

వేంపల్లె: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

శనివారం వేంపల్లె పట్టణంలోని టీఎస్ జెడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోలింగ్ బూత్‌లలో ఓటర్లకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, పోలింగ్ నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు.

పోలింగ్ విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, విధుల్లో ఉన్న సిబ్బందికి తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం వేంపల్లె ఎంపీడీవో కార్యాలయంలోని సభాభవనంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. కౌంటింగ్ కోసం ఏర్పాటు చేసిన టేబుళ్లు, సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలాంటి గందరగోళానికి తావులేకుండా క్రమబద్ధంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ ముందుగానే సిద్ధం చేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

పోలింగ్ ప్రారంభం నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ప్రతి దశలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికల నియమ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.