BREAKING
thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ
Test 4
Date of Publish : 28 November 2026, 08:12 pm
Posted by : SEETHA KIRAN KUMAR

కార్తిక దీపం అంటుకుని యువతి మృతి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
28 Nov, 2026 - 08:12 PM
26 వీక్షణలు

కార్తిక దీపం అంటుకుని యువతి మృతి.. చికిత్స పొందుతూ 18 ఏళ్ల సాయి వెంకట సింధు కన్నుమూత

హైదరాబాద్: కార్తిక దీపం ప్రమాదవశాత్తు చీరకు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడిన 18 ఏళ్ల యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పరిధి అడ్డగుట్ట వెస్ట్రన్ హిల్స్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. అడ్డగుట్ట వెస్ట్రన్ హిల్స్‌కు చెందిన సాయి వెంకట సింధు (18) బొటిక్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 12వ తేదీ రాత్రి షాప్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఇంటి గేటు వద్ద వెలిగించిన కార్తిక దీపం ప్రమాదవశాత్తు ఆమె చీరకు అంటుకుంది. క్షణాల్లోనే మంటలు చీరకు వ్యాపించడంతో సింధు తీవ్రంగా గాయపడ్డారు.

వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయి వెంకట సింధు చివరకు ప్రాణాలు కోల్పోయారు. చిన్న వయసులోనే ఆమె మృతి చెందడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

కార్తిక మాసంలో భక్తితో వెలిగించే దీపాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తుచేస్తోంది.