ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
విజయవాడ: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కనకదుర్గమ్మ ఆశీస్సులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై ఉండాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆకాంక్షించారు. అనంతరం వేద పండితులు రాష్ట్రపతికి ఆశీర్వచనం అందించి, అమ్మవారి ప్రసాదాలను సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, పలువురు రాష్ట్ర నాయకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.