జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
మంగళగిరి: మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్వయంగా పార్టీ కండువా కప్పి, ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని వంగవీటి రాధాకృష్ణను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రాధాకృష్ణ తనతో వచ్చిన అనుచరులను పవన్ కళ్యాణ్కు పరిచయం చేశారు.
పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజాసేవలో కలిసికట్టుగా పనిచేయాలని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా వారికి దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను పాల్గొన్నారు.