చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
చైతన్యపురి: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బద్దం సృజన ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. పూలతో అలంకరించిన బతుకమ్మల మధ్య దాండియా నృత్యం చేస్తూ సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటుతూ మహిళలతో కలిసి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు.
కార్యక్రమానికి హాజరైన బద్దం సృజన ప్రేమ్ మహేశ్వర్ రెడ్డికి మలబార్ గోల్డ్ & డైమండ్స్ సిబ్బంది స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ మహిళల్లో ఐక్యతను, ఆత్మీయతను పెంపొందించడంతో పాటు తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించే గొప్ప వేడుక అని పేర్కొన్నారు. మహిళలందరూ ఆనందోత్సాహాలతో బతుకమ్మ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు.