BREAKING
thumb ● ఆళ్లగడ్డలో యువకుడిపై కత్తితో దాడి thumb ● బేతుపల్లి చెరువులో ప్రమాదం.. 10 మంది ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది గల్లంతు thumb ● చిత్తాపురంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శ్రీకారం thumb ● ఎంజీయూ డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల thumb ● నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ కాలేక్ thumb ● నూతన మున్సిపల్ కమిషనర్‌కు ఘన స్వాగతం thumb ● కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపిన రంగన్న ఆత్మీయ సమ్మేళనం thumb ● రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి thumb ● ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో అక్రమాలపై బీఆర్‌ఎస్‌వీ ఫిర్యాదు thumb ● పేదల ముఖాల్లో ఆనందం నింపిన రవికుమార్ దంపతులు thumb ● ఆళ్లగడ్డలో యువకుడిపై కత్తితో దాడి thumb ● బేతుపల్లి చెరువులో ప్రమాదం.. 10 మంది ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది గల్లంతు thumb ● చిత్తాపురంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శ్రీకారం thumb ● ఎంజీయూ డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల thumb ● నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ కాలేక్ thumb ● నూతన మున్సిపల్ కమిషనర్‌కు ఘన స్వాగతం thumb ● కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపిన రంగన్న ఆత్మీయ సమ్మేళనం thumb ● రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి thumb ● ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో అక్రమాలపై బీఆర్‌ఎస్‌వీ ఫిర్యాదు thumb ● పేదల ముఖాల్లో ఆనందం నింపిన రవికుమార్ దంపతులు
Test 4
Date of Publish : 20 September 2026, 08:22 am
Posted by : SEETHA KIRAN KUMAR

వినాయక నిమజ్జనం.. వరంగల్ ట్రై సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
20 Sep, 2026 - 08:22 AM
106 వీక్షణలు

సెప్టెంబర్ 23 ఉదయం 10 గంటల నుంచి 25 సాయంత్రం 5 గంటల వరకు అమలు

వరంగల్: వినాయక నిమజ్జనం సందర్భంగా వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై సిటీ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు. సెప్టెంబర్ 23, 2026 ఉదయం 10 గంటల నుంచి సెప్టెంబర్ 25, 2026 సాయంత్రం 5 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు.

వినాయక విగ్రహాల శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా భారీ సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సూచించినట్లు పోలీసులు తెలిపారు.

భారీ వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలు

1. ములుగు–భూపాలపల్లి నుంచి హైదరాబాద్ వైపు: ఆరేపల్లి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు (ORR) మీదుగా వెళ్లాలి.

2. భూపాలపల్లి–పరకాల నుంచి ఖమ్మం వైపు: ఆరేపల్లి వద్ద ORR ఎక్కి కరుణాపురం–వెంకటాపురం–ఐనవోలు–పున్నేలు క్రాస్‌రోడ్ మీదుగా ఖమ్మం రోడ్డుకు చేరుకోవాలి.

3. భూపాలపల్లి–పరకాల నుంచి నర్సంపేట వైపు: కొత్తపేట–రెడ్డిపాలెం–జాన్పరలు–గొర్రెకుంట మీదుగా వెళ్లాలి.

4. కరీంనగర్ నుంచి ఖమ్మం వైపు: చింతగట్టు వద్ద ORRపైకి వెళ్లి యూ-టర్న్ తీసుకుని కరుణాపురం–వెంకటాపురం–ఐనవోలు–పున్నేలు క్రాస్‌రోడ్ మీదుగా ఖమ్మం రోడ్డుకు చేరుకోవాలి.

5. ఖమ్మం నుంచి కరీంనగర్/హైదరాబాద్ వైపు: పున్నేలు క్రాస్‌రోడ్–ఐనవోలు ఆర్చ్–వెంకటాపురం–కరుణాపురం మీదుగా వెళ్లాలి.

6. హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు: కరుణాపురం–వెంకటాపురం–ఐనవోలు–పున్నేలు క్రాస్‌రోడ్ మీదుగా వెళ్లాలి.

7. నగరంలోకి భారీ వాహనాలకు అనుమతి లేదు: నిమజ్జనం సమయంలో నగరంలోకి వచ్చే భారీ వాహనాలను నగరానికి అవతలే నిలిపివేయాలని పోలీసులు సూచించారు.

8. హైదరాబాద్ నుంచి నర్సంపేట వైపు: కరుణాపురం నుంచి ORR మీదుగా ఆరేపల్లి–ఆత్మకూరు–కటాక్షపూర్–మల్లంపల్లి మీదుగా నర్సంపేట వైపు వెళ్లాలి.

9. నర్సంపేట నుంచి వరంగల్/హైదరాబాద్ వైపు: మల్లంపల్లి–కటాక్షపూర్–ఆత్మకూరు–ఆరేపల్లి–ORR మీదుగా వెళ్లాలి.

నగరంలో బస్సులు, ఇతర వాహనాలకు మార్గదర్శకాలు

- ములుగు, పరకాల వైపు నుంచి వచ్చే బస్సులు పెద్దమ్మగడ్డ–KUC–C.V.P. అంబేద్కర్ సెంటర్–ఏషియన్ శ్రీదేవి మాల్ మీదుగా హన్మకొండ బస్టాండ్‌కు చేరుకోవాలి.

- హన్మకొండ బస్టాండ్ నుంచి ములుగు, కరీంనగర్ వైపు వెళ్లే బస్సులు ఏషియన్ శ్రీదేవి మాల్–అంబేద్కర్ సెంటర్–C.P.O.–KUC జంక్షన్ మీదుగా వెళ్లాలి.

- నర్సంపేట, కొత్తగూడెం, భద్రాచలం, తొర్రూరు, ఖమ్మం వైపు వెళ్లే బస్సులు బాలసముద్రం–అదాలత్–హంటర్ రోడ్ మీదుగా వెళ్లాలి.

- వరంగల్ బస్టాండ్ నుంచి హన్మకొండ వైపు వచ్చే బస్సులు చింతల్ బ్రిడ్జి–రంగశాయిపేట్–నాయుడు పెట్రోల్ పంప్ సెంటర్–ఉర్సుగుట్ట–అదాలత్–బాలసముద్రం రోడ్ మీదుగా వెళ్లాలి.

కాజీపేట–వరంగల్ మధ్య చిన్న వాహనాలకు మార్గాలు

కాజీపేట నుంచి వరంగల్ వైపు:

ఫాతిమా జంక్షన్–వడ్డేపల్లి చర్చి–KUC జంక్షన్–పెద్దమ్మగడ్డ–ములుగు రోడ్డు–MGM–జెమిని–పోతన జంక్షన్–అండర్ బ్రిడ్జి–హెడ్ పోస్టాఫీస్–వరంగల్ బస్టాండ్–వెంకట్రామ్ సర్కిల్ మీదుగా వెళ్లాలి.

వరంగల్ నుంచి కాజీపేట వైపు:

వెంకట్రామ్–వరంగల్ బస్టాండ్–హెడ్ పోస్టాఫీస్–అండర్ బ్రిడ్జి–పోతన జంక్షన్–జెమిని–MGM–ములుగు రోడ్డు–పెద్దమ్మగడ్డ–KUC జంక్షన్–వడ్డేపల్లి చర్చి–ఫాతిమా జంక్షన్ మీదుగా వెళ్లాలి.

వినాయక విగ్రహాల వాహనాలకు ప్రత్యేక మార్గదర్శకాలు


  • సిద్ధేశ్వర గుండంలో నిమజ్జనం అనంతరం విగ్రహ వాహనాలు శాయంపేట వైపు వెళ్లే రోడ్డు ద్వారా వెళ్లాలి.
  • శాయంపేట వైపు నుంచి వచ్చే విగ్రహ వాహనాలు హంటర్ రోడ్–అదాలత్–హన్మకొండ చౌరస్తా మీదుగా వెళ్లాలి.
  • ఎక్సైజ్ కాలనీ, రెవెన్యూ కాలనీ, వడ్డేపల్లి ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలను బంధం చెరువులో నిమజ్జనం చేయాలి.
  • చిన్న వడ్డేపల్లి చెరువులో నిమజ్జనం చేసిన వాహనాలు ఎనుమాముల రోడ్డు నుంచి నర్సంపేట రోడ్డు వైపు వెళ్లాలి.

ప్రజలు సహకరించాలి

నిమజ్జనం సందర్భంగా శోభాయాత్ర జరిగే మార్గాల్లో, నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో వాహనాలను నిలిపివేయవద్దని పోలీసులు సూచించారు. ట్రాఫిక్ ఆంక్షలు, ప్రత్యామ్నాయ మార్గాల విషయంలో ప్రజలు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత కోరారు.

వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ నిర్వహణ, రూట్ డైవర్షన్లపై తెలంగాణ పోలీస్ అధికారులు ముందస్తు ప్రణాళికలు రూపొందించినట్లు ఇటీవలి రాష్ట్రస్థాయి ఏర్పాట్లలోనూ వెల్లడైంది.