మణిపూర్లో హింస మరో 9 మంది మృతి
జాతీయం
జాతీయం
మణిపుర్‌లో కుకీ–నాగా తెగల మధ్య ఘర్షణలు.. 9 మంది మృతి
ఎన్ టుడే న్యూస్: మణిపుర్‌లో కుకీ, నాగా తెగల మధ్య మరోసారి తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. మూడు జిల్లాల్లో చోటుచేసుకున్న వేర్వేరు ఘటనల్లో తొమ్మిది మంది మరణించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు భారీగా భద్రతా దళాలను మోహరించారు.
ఓ మహిళను కాల్చిచంపిన ఘటన తాజా ఘర్షణలకు కారణమైందని అధికారులు వెల్లడించారు. హింసాత్మక ఘటనలు మరింత విస్తరించకుండా భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు.
రాష్ట్రంలో ప్రజలు శాంతి, సంయమనం పాటించాలని సీఎం ఖేమ్‌చంద్ సింగ్ విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఇరు తెగల మధ్య జరిగిన ఘర్షణల్లో 40 మందికి పైగా మరణించినట్లు సమాచారం.